● ఆలస్యంగా సంఘటన వెలుగులోకి..
అచ్చంపేట: సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వచ్చిన భక్తులపై పోలీస్ లాఠీచార్జి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈనెల 1నుంచి 3వరకు జరిగిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఐదురోజుల ఉత్సవాలను అటవీశాఖ మూడు రోజులకు కుదించడంతో నల్లమల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మొదటిరోజు నుంచే చెప్పుల కుర్వ వద్ద భక్తుల రాకపోకలను నియంత్రించినప్పుటికీ అదుపు తప్పింది. ఈ క్రమంలో భక్తుల తాకిడికి ఇనుప కంచె, బారికేడ్లు తట్టుకోలేదు. లోయ ప్రాంతంలో భక్తుల నియంత్రణంలో భాగంగా పోలీసులు, అటవీశాఖ వలంటీర్లు అదుపు చేసే సమయంలో లాఠీచార్జీ చేసిన వీడియో సోషల్ మీడియా, ఇన్‌స్ర్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లో హల్‌చల్ అవుతుంది. మునుపటి మాదిరిగానే భక్తులను ఐదురోజులపాటు అనుమతిస్తే ఇంత తాకిడి ఉండదని, వచ్చే ఏడాదికై నా అటవీ, పోలీస్‌శాఖలు ఈ విషయంపై పునపరిశీలిస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నారు. ఏడాది పొడవునా అనుమతిస్తామని రెండేళ్లుగా ఊరిస్తున్న అటవీశాఖ ఐదురోజులకు అనుమతి ఇవ్వడంలో వారికి వచ్చే ఇబ్బంది ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


