రాష్ట్రంలోని 108 వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. కొన్ని వాహనాల కాలం చెల్లిపోవడంతో మార్చాలని, అవసరమైన చోట సేవలు విస్తరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. మూడురకాల వాహనాలకు సరికొత్తగా బ్రాండింగ్ చేశారు. 108, 102 అనే హెల్ప్‌లైనన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశాం. సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో, తెలంగాణ ప్రభుత్వం లోగో, ఉచిత సేవ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మఒడి వాహనాల వెనుక భాగంలో ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ అనే ట్యాగ్‌లైన్‌న్ వాహనాల పనితీరుకు అద్దం పడుతోంది. కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందుతాయి.
– వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి


