మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఎంపికల్లో పాల్గొనాలి. సంబంధిత ధృవపత్రాలతో ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలి. మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్‌ను సంప్రదించాలి.
–ఎస్.శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి, మహబూబ్‌నగర్
క్రీడా పాఠశాలతో ఉజ్వల భవిష్యత్
స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికై న వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. విద్యార్థులను ఇటు చదువుతోపాటు అటు క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందజేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతారు. ఈ అవకాశాన్ని క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉపయోగించి భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి.
–వేణుగోపాల్, సీనియర్ పీడీ, జెడ్పీహెచ్‌ఎస్ చిన్నదర్పల్లి, మహబూబ్‌నగర్
●


