మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు జిల్లా స్థాయిలో సెలక్షన్స్ మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లాలోని టీజీజీఎస్‌ఎస్ హకీంపేటతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 2026–27 సంవత్సరానికి 4వ తరగ తిలో ప్రవేశాలు జరగనున్నాయి. ప్రతి స్కూల్‌లో 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలను, హన్మకొండ స్కూల్‌లో 40మంది బా లురు, 40మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు.
ఉమ్మడి జిల్లాలో సందడి..
ఉమ్మడి జిల్లాలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ సందడి నెలకొంది. సోమవారం నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిలాల్లో జిల్లాస్థాయి సెలక్షన్స్ జరగగా నేడు (మంగళవారం) మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా వనపర్తి జిల్లాలో నేడు బాలుర, బుధవారం బాలికల జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌కు వెళ్తారు. ఏఫ్రిల్ 27వ తేదీ నుంచి మే 1 వరకు రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరగనున్నాయి. మే 13, 14 తేదీల్లో కౌన్సెలింగ్, జూన్ 12న ఎంపికై న విద్యార్థులు ఆయా స్పోర్ట్స్ పాఠశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కావాల్సిన ధ్రువపత్రాలు
స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలకు విద్యార్థులు ధ్రువ పత్రాలతో రావాలి. ఒరిజినల్ ఆధార్‌కార్డు, 4వ తరగతి సర్టిఫికెట్, వయస్సు ధృవీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, విద్యార్థులు 8 నుంచి 9 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి, 01–09–2017 నుంచి 31–08–2018 మధ్య పుట్టిన వారు అర్హులు.
నేడు మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లా కేంద్రాల్లో సెలక్షన్స్
ఇప్పటికే నాగర్‌కర్నూల్,
గద్వాల జిల్లాల్లో పూర్తి
ఏప్రిల్‌లో రాష్ట్రస్థాయి సెలక్షన్స్


