గద్వాల క్రైం: పట్టణంలోని ఓ పెయింట్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది, బాధితుడు రఘురాం కథనం మేరకు.. తుల్జారాం దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి పెయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ సంభవించి దుకాణంలోని రూ.30 లక్షల విలువగల పెయింట్ డబ్బాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అశోక్, రాకేష్, గౌస్, రాజశేఖర్‌లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో సాధ్యం కాలేదు. మరో ఫైర్ ఇంజిన్ సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.


