కేటీదొడ్డి: మండలంలోని గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక క్కడే మృతిచెందగా, మ రో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తుల స మాచారం మేరకు.. కుచినెర్లకు చెందిన మల్లేష్ (24) అదే గ్రామానికి చెందిన శేషప్ప, కుర్వ మల్లేష్‌తో కలిసి బైక్‌పై నందిన్నె నుంచి కుచినెర్ల వైపు బయలుదేరారు. వీరి బైక్ కుచినెర్ల వాగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మల్లేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న శేషప్ప, కుర్వ మల్లేష్ సమీపంలోని పొలంలో పడిపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు.
కుటుంబంలో విషాదం
మృతుడు మల్లేష్ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, భార్యాపిల్లల రోధనలు విన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.
గంజాయి సరఫరా చేసే ఇద్దరి అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎండు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరూ యువకులను ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏఈఎస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం డీటీఎఫ్ బృందం మన్యంకొండ స్టేజీ దగ్గర చేసిన వాహనాల తనిఖీల్లో భానుప్రసాద్‌గౌడ్, సోమ్లానాయక్ బైక్‌లో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా హైదరాబాద్ నుంచి గంజాయి తీసుకొచ్చి జిల్లాలో విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరినుంచి 200గ్రాముల గంజాయి, ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. ఈ ఇద్దరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే 8712658872కు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో సీఐ కవిత, ఎస్‌ఐ రాజేందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలు శిక్ష
మహబూబ్‌నగర్ క్రైం: హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2023 జనవరి 31న చెన్నారెడ్డిపల్లిలో భూవివాదం నేపథ్యంలో ఎరుకలి వెంకటయ్య, ఎరుకలి శ్రీను, ఎరుకలి మల్లేష్ ముగ్గురు కలిసి పథకం ప్రకారం ఎరుకలి చెన్నయ్యను కర్రలు, కత్తులతో పొడిచి హత్య చేయడానికి దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు ఎరుకలి చెన్నయ్యకు తల, శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై 2023 ఫిబ్రవరి 1న కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నవాబ్‌పేట పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా గురువారం ఈ కేసు కోర్టుకు వచ్చింది. ఈ కేసుపై వాదనలు పూర్తయిన తర్వాత నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ఈశ్వరయ్య ముగ్గురు నేరస్థుల్లో ఒక్కొక్కరికి నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.6వేల జరిమానా విధించడంతోపాటు బాధితుడికి పరిహారంగా రూ.30వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ అధికారులతోపాటు కోర్టు సిబ్బందిని ఎస్పీ జానకి అభినందించారు.
సంస్థల పేరుతో
బలవంతపు వసూళ్లు
జడ్చర్ల: వృద్ధాశ్రమం తదితర సంక్షేమ సంస్థల పేరుతో బలవంతంగా చందాలు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ కథనం మేరకు.. కోడింగటి నర్సింహ, మూడ నర్సమ్మ, సిరిగిరి శివశంకర్, రమేశ్, బన్ని తదితరులు గురువారం ఓ కారులో జడ్చర్లలో పలువురు వ్యాపారులు తదితరుల దగ్గరకు వెళ్లి తాము ఆదర్శ హోం ఫర్ చిల్డ్రన్, ఆదర్శ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నామని తమకు సహాయం అందించాలని పట్టణంలోని పలువురు వ్యాపారులను డిమాండ్ చేశారు. అయితే తాము డబ్బులు ఇవ్వలేమని చెప్పగా.. తాము బహుజన సామాజికవర్గానికి చెందిన వారమని, మిమ్మల్ని ఇబ్బందుల పెట్టే పనులు చేయాల్సి వస్తుందని, అంతు చూడాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. దీంతో భయబ్రాంతులకు గురైన పతంజలి దుకాణం నిర్వాహకులు బండారు అచ్చుతారెడ్డి రూ.5వేలు, మరో వ్యాపారి మంచని పాండయ్య రూ.21,000, మనోహర్ రూ.5,116, బక్క రామ్మోహన్ రూ.5116, నర్సింహులు రూ.21,000, గోవర్ధన్‌రెడ్డి రూ.5000, బండారు కృష్ణారెడ్డి రూ.15,000 తదితరులతో డబ్బులు వసూలు చేశారు. బాధితుడు అచ్చుతారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


