ఉత్కంఠగా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠగా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

Mar 27 2026 9:58 AM | Updated on Mar 27 2026 9:58 AM

పాలమూరు: జిల్లా బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికకు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బార్‌ అసోసియేషన్‌ భవన్‌లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 505 ఓటర్లు ఉండగా దీంట్లో 454ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం చేయగా.. రాత్రి 10:30గంటలకు ముగిసింది. నూతన అధ్యక్షుడిగా ఆనందరావు తన సమీప ప్రత్యేర్థి ఉమామహేశ్వరిపై 181 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా వెంకటయ్య తన ప్రత్యర్థి రాజశేఖర్‌పై 27ఓట్ల తేడాతో విజయం సాధించాడు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నర్సింహారెడ్డి తన సమీప ప్రత్యేర్థి శ్రీధర్‌రావుపై 61ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోశాధికారిగా బి.రాజుగౌడ్‌ ప్రత్యర్థి వెంకట్‌రావుపై 31ఓట్ల అధిక్యతతో విజయం సాధించాడు. కార్యవర్గ సభ్యులుగా కృష్ణవంశీ, మహేశ్‌కుమార్‌, విష్ణు వేద, శ్రీకర్‌, చంద్రశర్మ, మురళీమోహన్‌, మధ్వరాజ్‌ గెలుపొందారు. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా సబితా, గ్రంథాలయ కార్యదర్శిగా ప్రభావతి, మహిళా కార్యవర్గ సభ్యులుగా మమత, ఝాన్సీ, జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కొండయ్య ప్రకటించారు. గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులకు ఎన్నికల అధికారి నియామక పత్రాలు అందజేశారు.

పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఆనందరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement