పేదలకు సేవ చేసేందుకే ఆస్పత్రి ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

పేదలకు సేవ చేసేందుకే ఆస్పత్రి ఏర్పాటు

Mar 26 2026 10:44 AM | Updated on Mar 26 2026 10:44 AM

ఆ ఘటన మరిచిపోలేను..

25 ఏళ్ల అనుభవంలో

ఎన్నో వైద్య సేవలు

సుశ్రుత ప్రజావైద్యశాల

ఎండీ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి

పాలమూరు: పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యత వైద్యం అందించాలనే లక్ష్యంతోనే సుశ్రుత ప్రజా వైద్యశాల 2001 ఏప్రిల్‌ 5న 20 పడకలతో ప్రారంభించారు. మొదట్లో కేవలం సర్జరీ, గైనిక్‌ విభాగాలతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్న దశాలవారిగా 12 విభాగాలకు విస్తరించారు. ఏప్రిల్‌ 5తో ఆస్పత్రి ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తవుతాయి. 20 నుంచి 50 పడకలకు ఆ తర్వాత 120 పడకలకు పెంచామని, ఆస్పత్రిలో ఇప్పటి వరకు 40 వేల అన్ని రకాల సర్జరీలు చేయగా 10 వేల ప్రసవాలు చేశారు. లక్ష వరకు అడ్మిట్‌ అయిన రోగులకు వైద్య సేవలు అందిస్తే.. ఆరు లక్షల వరకు ఓపీ సేవలు అందించారు. ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా 50 పడకలకు 2010లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో మొదటిసారి 2013లో టెస్టు ట్యూబ్‌ బేబీకి చికిత్స శ్రీకారం చుట్టగా.. ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీలో గుండె సర్జరీలు ఉచితంగా నిర్వహించారు. ప్రస్తుతం 12 విభాగాలలో 150 మంది వైద్య సిబ్బందితో వైద్యసేవలు అందిస్తున్నారు.

ప్రత్యేక గుర్తింపు

సుశృత ఆస్పత్రి నిర్వహణలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడేషన్‌ గుర్తింపు వచ్చింది. దీనికోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం సందర్శించి అన్ని రకాల తనిఖీలు చేసిన తర్వాతే ఈ గుర్తింపు ఇచ్చింది. దీంతోపాటు ఐ ఇౖ అవార్డు సైతం వచ్చింది.

నాకు చిన్ననాటి నుంచి పేదలకు ఏదో రకమైన సేవ చేయాలనే ఆసక్తి ఉండేది. దీంతో వైద్య రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకొని ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత యూకేలో ఎఫ్‌ఆర్‌సీఎస్‌ పూర్తి చేసి ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ పట్టణంలో 2001లో ఆస్పత్రి ప్రారంభించాం. నా ప్రాక్టీస్‌ కొత్తలో 2003లో సరైన వైద్య సేవలు అందుబాటులో లేని సమయంలో వనపర్తికి చెందిన గర్భిణికి ప్రసవం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. ఆమె ఊపిరితిత్తుల్లో చీము ఉండటం వల్ల ప్రసవం కష్టంగా మారింది. దీంతో మా ఆస్పత్రిలో ఆమెకు ప్రత్యేక వైద్యంతో చీము తొలగించి ప్రసవం చేస్తే బాబు జన్మించాడు. ఆ బాబుకు నా పేరు పెట్టుకోవడం నేను మరిచిపోలేని విషయం.

– డా. మధుసూదన్‌రెడ్డి,

జనరల్‌ ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement