● రెండుసార్లు హెచ్‌సీఏ
అండర్–14కు ఎంపిక
● చైన్నెలో జరిగిన లీగ్‌లో టాప్‌స్కోరర్
● సెంచరీలతో రాణింపు
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ రూరల్ మండలం అల్లీపూర్‌కు చెందిన పిట్ల యాదయ్య, శైలజ దంపతుల కుమారుడు సాయిరాం క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. తల్లిదండ్రులతోపాటు తాతయ్య పిట్ల ఊషన్న కూడా సాయిరాంను క్రికెట్‌లో ప్రోత్సహిస్తున్నారు. సాయిరాం జిల్లాకేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా.. గత ఐదేళ్ల నుంచి క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్న సాయిరాం అనతికాలంలోనే బ్యాటింగ్‌లో సత్తాచాటి అందరి మన్ననలు పొందుతున్నాడు. మొదట్లో ఇంటివద్ద నుంచే సాయిరాం తన క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. కోచ్ భరత్‌గౌడ్ ఇంటి వద్దే ప్రత్యేక క్రికెట్ శిక్షణ ఇచాడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ పట్టణంలోని పెవిలియన్ క్రికెట్ క్లబ్‌లో కోచ్ భరత్‌గౌడ్ వద్ద క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటూ బ్యాటింగ్‌లో రాణిస్తున్నాడు.
బ్యాటింగ్‌లో మెరుగైన ప్రతిభ
గతేడాది హైదరాబాద్‌లోని నటరాజ్ క్రికెట్ క్లబ్ తరపున బ్యాటింగ్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. ఈ సీజన్‌లోనూ సాయి
రాం బ్యాటింగ్‌లో మెరుగైనప్రదర్శన కనబరిచా డు. హైదరాబాద్‌లోని ఎంఎల్ జయసింహ క్రికెట్ క్లబ్ తరపున ఈ సీజన్ లో తొమ్మిది లీగ్ మ్యా చుల్లో 280 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్‌లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అండర్–14 ప్రాబ బుల్స్ నాలుగు మ్యాచుల్లో 232 పరుగులు చేసి రాణించాడు. ఒక మ్యాచ్‌లో 121 పరుగులు నాటౌట్, మరో మ్యాచ్‌లో 82 పరుగులు చేసి మరోసారి హెచ్‌సీఎం అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. చైన్నెలో ఫిబ్రవరి 13
నుంచి 23 వరకు జరిగిన అండర్–14 క్రికెట్ టోర్నీలో పాల్గొని
150 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబాయి జట్టుపై 88 పరుగులు, తమిళనాడు జట్టుపై 56 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు.


