మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలో ఆస్తిపన్ను, నల్లా బిల్లు లు, ట్రేడ్ లైసెన్స్ వ సూళ్లలో లక్ష్యం చేరుకో వాలని ఇన్‌చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉందని వీటి వసూలుకు అయిదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పాత బకాయిలతో కలుపుకొని ఆస్తిపన్ను మొత్తం రూ.51.61 కోట్లకు గాను కేవలం రూ.19 కోట్లే వసూలు కావడమేమిటని మండిపడ్డారు. ఇంకా రూ.7 కోట్లు రాబట్టగలిగితేనే 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.27 కోట్ల గ్రాంట్ మంజూరవుతుందన్నారు. సమావేశంలో కమిషనర్ పి.రామాంజులరెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఆర్‌ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య, డీఈఈలు విజయ్‌కుమార్, నర్సింహ, హేమలత తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,889
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.7,889, కనిష్టంగా రూ.4,505 ధరలు లభించాయి. అలాగే కందులు గరిష్టంగా రూ.6,511, కనిష్టంగా రూ.5,569, జొన్నలు గరిష్టంగా రూ.5,777, కనిష్టంగా రూ.4,127, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,050, కనిష్టంగా రూ.4,777 చొప్పున వచ్చాయి.


