ఓటు కోసం పరుగో పరుగు..!
ప్రవేశ పరీక్షల చివరి సమయంలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉరుకులు పరుగులు తీస్తూ చేరుకునే దృశ్యాలు సాధారణంగా చూస్తుంటాం. కానీ, అలాంటి ఘటనే ఎర్రవల్లి పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం చోటుచేసుకుంది. కేవలం పోలింగ్ సమయం ముగిసే 2 నిమిషాల ముందు పోలింగ్ కేంద్రంలోకి పరుగున వచ్చి.. ఓటు వేసింది
ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రవల్లికి చెందిన సువర్ణ ఆంధప్రదేశ్ రాష్ట్రం కర్నూల్‌లో ఉంటుంది. ఓటు వేసేందుకుగాను భర్తతో కలిసి బైక్‌పై ఎర్రవల్లికి వస్తుండగా మార్గమధ్యలో బైక్ రిపేర్ కావడంతో ఆలస్యమైంది. సరిగ్గా 12.58 గంటలకు ఉరుకులు పరుగులు పెడుతూ పోలింగ్ కేంద్రానికి చేరుకోగా.. రెండు నిమిషాల సమయం ఉండడంతో అక్కడి అధికారులు గేటు తెరిచి లోపలికి అనుమతిచ్చారు. పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంది. పోలింగ్ కేంద్రంలో చివరి ఓటు తనదే అవుతుందని అస్సలు ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. – ఎర్రవల్లి
ఎర్రవల్లి పోలింగ్
కేంద్రంలోకి
పరిగెడుతున్న సువర్ణ


