లారీ, ఆటో ఢీ.. ఇద్దరి దుర్మరణ ం
మక్తల్: పట్టణ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన కొంతమంది కూలీలు స్థానిక హిర్షద్ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరిలో రవీంద్ర కుమార్ (32), ప్రదీప్ కుమార్ (40) ఇద్దరు కలిసి మంగళవారం అర్ధరాత్రి స్వగ్రామానికి వెళ్లడానికి బస్టాండ్‌కు వెళ్లారు. ఎంత సేపు వేచిచూసిన బస్సు రాకపోవడంతో ఆకలి అవుతుండడంతో బస్టాండ్ దగ్గర ఉన్న ఆటో తీసుకొని సమీపంలోని డాబా దగ్గరకు బయలుదేరారు. అదే సమయంలో మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్‌కు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ కాశీనాత్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు.


