ఆనందంగా ఉంది..
మండలాల వారీగా ఇలా..
● పోటాపోటీగా సర్పంచ్ ఫలితాలు
● బీఆర్‌ఎస్ 30, కాంగ్రెస్ 25,
స్వతంత్రులు 20 జీపీలు కై వసం
మొదటి సారి ఓటు హక్కు వచ్చింది. తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు
వినియోగించుకోవడం ద్వారా వయోజనుడిగా ప్రశ్నించే హక్కు కలుగుతుంది. – పవన్‌కుమార్, నేరడగం గ్రామం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో జరిగిన తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్సే పైచేయి సాధించింది. బుధవారం అడ్డాకుల మండలంలో 17, బాలానగర్‌లో 37, భూత్పూర్‌లో 19, జడ్చర్లలో 45, ముసాపేట మండలంలో 15 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో మొత్తం 133 సర్పంచ్ స్థానాలకు గాను నామినేషన్ల ఉపసంహరణ నాటికే 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జడ్చర్ల మండలంలో ఒక సర్పంచ్ స్థానానికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. మిగిలిన 122 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 67 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 52 స్థానాల్లో గెలుపొందారు. ఈ విడతలోనూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
జడ్చర్ల మండలంలో బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న పలు మేజర్ జీపీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు తమ హవాను కొనసాగించారు. నసరుల్లాబాద్, గంగాపూర్, కోడ్గల్, పెద్దపల్లి, పెద్ద ఆదిరాల గ్రామాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఘోర పరాజయం పాలయ్యారు.
భూత్పూర్ మండలంలో 14 సర్పంచ్ స్థానాలకు గాను లంబడికుంట తండా, తాటిపర్తి, కొత్తూర్, రావులపల్లి, శేరిపల్లి(హెచ్), అన్నాసాగర్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారు. ఆరు జీపీలు కొత్తమొల్గర, పాత మొల్గర, పోతులమడుగు, హస్నాపూర్, కర్వెన, కప్పెటలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ఎల్కిచర్లలో స్వతంత్ర అభ్యర్థి నెగ్గడం విశేషం. శేరిపల్లి (హెచ్)లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్ధి చంద్రకళ రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
అడ్డాకుల మండలంలో 17 జీపీలు ఉండగా.. కాంగ్రెస్ మద్దతుదారులు అడ్డాకుల, కాటవరం, రాంచంద్రాపూర్, పెద్దమునుగల్‌చేడ్, రాచాల, బలీదుపల్లి, తిమ్మాయిపల్లి, శాఖాపూర్‌లో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులు వర్నె, చిన్నమునుగల్‌చేడ్, సుంకరామయ్యపల్లి, పొన్నకల్, కన్మనూర్, తిమ్మాయిపల్లి, గుడిబండలో గెలుపొందారు. కందూర్‌లో బీజేపీ మద్దతుదారు సర్పంచ్ కుర్చీని దక్కించుకున్నారు.
మూసాపేట మండలంలో 15 జీపీలు ఉండగా.. కాంగ్రెస్ మద్దతుదారులు మూసాపేట, సంకలమద్ది, నందిపేట, తుంకినీపూర్, స్ఫూర్తితండా, పోల్కంపల్లి, కొమిరెడ్డిపల్లి, వేముల, నిజాలాపూర్ జీపీల్లో, బీఆర్‌ఎస్ మద్దతుదారులు దాసర్‌పల్లి, మహ్మదుస్సేన్‌పల్లి, జానంపేట, తిమ్మాపూర్, చక్రాపూర్‌లో గెలుపొందారు. అచ్చాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు ఏకగ్రీవమయ్యారు.
తొలిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకుంటే అంత ఎక్కువ ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది.
– దీపిక, మాగనూర్
తొలిసారి ఓటు హక్కు వచ్చింది. ఓటు హక్కు మన అందరి బాధ్యత. దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మొదటిసారి ఓటు వేయడం సంతోషంగా ఉంది. ఈవీఎం ద్వారా ఓటు వేయాల్సి ఉందని అనుకున్నా. కానీ బ్యాలెట్ పేపర్‌పై వేయడం జరిగింది. మొత్తంగా మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సమర్థవంతమైన వ్యక్తులకే నా ఓటు వేశాను. – శ్యాముల్, నేరడగం
మండలాల వారీగా..
మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
అడ్డాకుల 17 8 7 1 1
బాలానగర్ 37 15 15 2 5
భూత్పూర్ 19 11 7 0 1
జడ్చర్ల 45 22 18 1 3
మూసాపేట 15 9 5 0 1
అలంపూర్‌లో గులాబీ జోరు
పాలమూరులో మూడో విడతలోనూ హస్తం హవా
ఆనందంగా ఉంది..
ఆనందంగా ఉంది..
ఆనందంగా ఉంది..
ఆనందంగా ఉంది..
ఆనందంగా ఉంది..
ఆనందంగా ఉంది..


