ఓవైపు సంతోషం.. మరోవైపు విషాదం
జడ్చర్ల: సర్పంచ్‌గా గెలిచిన సంతోషం ఓ వైపు ఉండగానే.. మరో వైపు అదే కుటుంబ సభ్యురాలు ఆకస్మికంగా మృత్యువాత పడడంతో ఒక్కసారిగా వారంతా శోకసంద్రంలో మునిగిన ఘటన జడ్చర్ల మండలంలోని ఎక్వాయపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. ఎక్వాయపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పోలం మమత తిరుపతయ్య 432 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఆనందంతో పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి చేరకముందే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అత్త పోలం భారతమ్మ (70) ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో సంతోషం వెల్లివిరియాల్సిన ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. గెలుపు సంబరాలలో మునిగి తేలాల్సిన అభ్యర్థి, ఆమె మద్దతుదారులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు.
మరింత పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. నవంబర్ మూడోవారంలో కొత్త ఉల్లి మార్కెట్‌కు వచ్చిన సమయంలో క్వింటా రూ.800 ధర పలకగా.. రెండువారాల తర్వాత రూ.1,600కు పెరిగింది. గత వారం రూ.1,800.. ఈ వారం ఏకంగా క్వింటా గరిష్టంగా రూ.2,600, కనిష్టంగా రూ.,2000 ధరలు లభించాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ చివరి వరకు రూ.రెండు వేలు దాటని ఉల్లి ధర ప్రస్తుతం గరిష్ట ధరకు చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బస్తా రూ.1,300..
ఉల్లి వేలం తర్వాత 50 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,000కి విక్రయించారు. మార్కెట్‌కు దాదాపు 500 బస్తాల ఉల్లి విక్రయానికి వచ్చింది.
● గెలుపు ఇంట కుటుంబసభ్యురాలి
ఆకస్మిక మృతి
ఓవైపు సంతోషం.. మరోవైపు విషాదం


