తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొని తెలంగాణ ఔనత్యాన్ని చాటాలని పీయూ వీసీ శ్రీనివాస్ కోరారు. జిల్లాకేంద్రం సమీపంలోని ఎస్సీ గురుకుల విద్యార్థిని పాత్లావత్ పద్మావతి పీయూ తరఫున ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొననుండగా.. బుధవారం ఆయన విద్యార్థిని అభినందించి మాట్లాడారు. వివిధ దశల్లో జరిగిన స్క్రీనింగ్ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ చాటి ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. పరేడ్‌లో ప్రధాని, రాష్ట్రపతి తదితర ప్రముఖులు పాల్గొంటారని.. యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ప్రవీణ, కంటినిజెంట్ అధికారి అర్జున్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ట్రెయినీ మున్సిపల్
కమిషనర్‌గా దిలీప్‌రెడ్డి
● పాలమూరు, జడ్చర్లలో
20 రోజుల పాటు శిక్షణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఇటీవల గ్రూప్–1లో విజయం సాధించి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికై న దిలీప్‌రెడ్డి శాఖాపరంగా శిక్షణ పొందేందుకు గాను బుధవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు. ఇక్కడే పది రోజుల పాటు ఉండి ఆయా విభాగాలలో చేపట్టే పనులను పరిశీలించనున్నారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత జడ్చర్ల మున్సిపాలిటీలో మరో పది రోజుల పాటు తర్ఫీపు పొందనున్నారు. కాగా, వనపర్తి జిల్లా ఖిల్లాగణపురానికి చెందిన ఈయన కొన్నాళ్లుగా తల్లిదండ్రులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని దేవునిపాలెంలో నివాసం ఉంటున్నారు.


