నల్లమలలో పెద్దపులుల కనువిందు
మన్ననూర్: నల్లమల, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంగల్ సఫారీలో ప్రయాణం చేస్తున్న ప్రకృతి ప్రియులకు అటవీ ప్రాంతంలో తరుచుగా పెద్దపులులు కనిపిస్తుండటంతో పర్యాటకుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆదివారం సాయంత్రం సమయంలో హైద్రాబాద్‌కు చెందిన కొందరు సఫారీలో ప్రయాణిస్తుండగా నిజాం బంగ్లా సమీపంలో వాహనం ముందు నుంచి పెద్ద పులి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. అభయారణ్యంలో సహజ సిద్ధంగా సంచరిస్తున్న పెద్దపులిని చూసి సంబరపడిన పర్యాటకులు వారి సెల్‌ఫోన్‌లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.


