ఏజెన్సీ పేరున్నా.. గిరిజనులు లేరాయె!
అచ్చంపేట: ఏజెన్సీ పంచాయతీలుగా గుర్తింపున్న కొన్ని గ్రామాలకు ఎస్టీ ఓటర్లు లేక ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. వాటిని నాన్ ఏజెన్సీ గ్రామాలుగా మార్చాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయడం రాజ్యాంగ పరమైన మార్పులతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అది అనుకున్నంత సులువైనదేం కాదు. మూడంచెల పంచాయతీరాజ్ చట్టం 1995 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ఏజెన్సీలో 1/70 చట్టం అమలు కారణంగా ఈ గ్రామాల్లో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీలకే ఉంటుంది. అప్పట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన తప్పులతో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, లక్ష్మాపూర్, కల్ములోనిపల్లి, వంగరోనిపల్లి, ప్రశాంత్‌నగర్ ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో కుమ్మరోనిపల్లి పంచాయతీ నుంచి వంగరోనిపల్లి, మన్ననూర్ నుంచి ప్రశాంత్‌నగర్, కల్ములోనిపల్లి నుంచి తెలుగుపల్లి, లక్ష్మాపూర్ నుంచి లక్ష్మాపూర్‌తండాను ప్రత్యేక పంచాయతీలుగా మార్చడంతో గిరిజనేతరులున్నా ఏజేన్సీ గ్రామాలుగా ఏర్పడ్డా యి. సర్పంచ్‌తోపాటు వార్డుస్థానాలను ఎస్టీలకు కేటాయించడంతో ఎన్నికలకు అవరోధకంగా మారుతోంది. సర్పంచ్‌తో సహా 8వార్డుల్లో 4వార్డులకు జరపాల్సిన ఎన్నికలు ఎస్టీ జనాభా లేకుండా వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఎస్టీ జనాభా లేక పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేకుండా పోయింది.
హన్వాడ: మండలంలోని టంకర సర్పంచ్ స్థానానికి ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో మహిళా జనరల్‌లో పోటీచేసిన స్వంతంత్ర అభ్యర్థిని మెండె లక్ష్మి భారీ మెజార్టీతో గెలుపొందింది. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని మదులపాటి పూజపై 2వేల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 3,425 ఓట్లలో 3,113ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి మెండె లక్ష్మికి 2,113ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిని మధులపాటి పూజకు వెయ్యి ఓట్లు వచ్చాయి. మండలంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థినిగా నిలిచింది. స్వతంత్ర అభ్యర్థిని మెండె లక్ష్మికి స్థానిక బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు మద్దతుగా నిలవడంతో ఆమె గెలుపు సులువుగా మారింది. ఆమె ప్యానెల్‌లో బీజేపీ 5, బీఆర్‌ఎస్ 6వార్డు స్థానాలు కై వసం చేసుకోగా.., కాంగ్రెస్ కేవలం ఒక్కవార్డు స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఆ వార్డు స్థానం కూడా కేవలం 6ఓట్ల స్వల్ప మెజార్టీలో గెలుపొందింది.
భారీ మెజార్టీతో
స్వతంత్ర అభ్యర్థి ఘనవిజయం
ఏజెన్సీ పేరున్నా.. గిరిజనులు లేరాయె!


