సుంకరామయ్యపల్లిలో ఒకే ఓటు..!
అడ్డాకుల: సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఓటుతో పాటు వార్డు సభ్యుడి ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ అడ్డాకుల మండలం సుంకరామయ్యపల్లి గ్రామంలో మాత్రం ఒకే ఓటు వేయాల్సి ఉంది. అది కూడా సర్పంచ్ ఓటు మాత్రమే. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో 445 ఓట్లు, 8 వార్డు స్థానాలు ఉన్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు ఒక్కో వార్డుకు ఒక్కరితోనే నామినేషన్ వేయించారు. సర్పంచ్ స్థానానికి మాత్రం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో సర్పంచ్ ఎన్నిక అనివార్యమైంది. ఇకపోతే వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో వారంతా ఏకగ్రీవమయ్యారు. ఇక రేపు (బుధవారం) గ్రామంలో జరిగే పోలింగ్‌లో ఓటర్లు సర్పంచ్ ఓటు మాత్రమే వేయాల్సి ఉంది.


