అన్నదమ్ముళ్ల సవాల్..!
● రసవత్తరంగా స్థానిక ఎన్నికలు
● తిమ్మాయిపల్లి తండాలో సొంత అన్నదమ్ముళ్ల మధ్య పోటీ
● అడ్డాకులలోనూ సోదరుల పోరు
● సుంకరామయ్యపల్లిలో బాబాయ్, అబ్బాయ్‌ల అమీతుమీ
అడ్డాకుల: పల్లె పోరులో రక్తం పంచుకు పుట్టిన వారు, ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రత్యర్థులవుతున్నారు. సొంత అన్న, తమ్ముళ్లు, బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య పోటీతో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లితండాలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నలుగురిలో జరుప్ల హన్మంతునాయక్, జరుప్ల గోపాల్‌నాయక్ సొంత అన్నదమ్ముళ్లు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థిగా హన్మంతునాయక్, రెబల్‌గా గోపాల్‌నాయక్ పోటీ చేస్తున్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో బీఆర్‌ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నుంచి బొక్కలపల్లి దశరథ్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు వరుసకు అన్నదమ్ముళ్లు. సుంకరామయ్యపల్లిలో బాబాయ్, అబ్బాయ్ మధ్య పోటీ జరుగుతోంది. బీఆర్‌ఎస్ తరఫున ఆకులమోని రవి, కాంగ్రెస్ తరఫున ఆకులమోని చెన్నకేశవులు పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏకగ్రీవంగా రవిని సర్పంచ్, చెన్నకేశవులను ఉప సర్పంచ్‌గా నిర్ణయం తీసుకున్నా నామినేషన్ల ఉపసంహరణ రోజు ఏకాభిప్రాయం కాస్త పోరుకు దారి తీసింది. ఏదేమైనా పల్లె పోరులో రక్తం పంచుకు పుట్టిన వారు కూడా ప్రత్యుర్థులుగా మారడం రసవత్తరంగా మారింది.
గోపాల్‌నాయక్
– జరుప్ల
తిరుపతిరెడ్డి–
బొక్కలపల్లి
దశరథ్‌రెడ్డి–
బొక్కలపల్లి
రవి–
ఆకులమోని
చెన్నకేశవులు– ఆకులమోని


