ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే..
పాలమూరు: పోలింగ్ కేంద్రంలో ఓటరుకు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. కానీ ఆ వ్యక్తి ఎడమచేతికి చూపుడువేలు లేకుంటే ఎలా? అనే ప్రశ్న కొందరికి తలెత్తవచ్చు. ఎన్నికల సంఘం దీనికి ప్రత్యామ్నాయం చూపింది. ఎడమచేతి చూపుడువేలు లేకపోతే మధ్య వేలు, అదికూడా లేకుంటే ఉంగరం వేలు, అదీ లేకుంటే చిటికెన వేలు, అదీ లేకుంటే బొటన వేలుకు సిరాచుక్క పెట్టే అవకాశం కల్పించింది. ఎడమ చెయ్యి లేకుంటే కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, బొటనవేలుకు సిరాచుక్క పెట్టవచ్చు. రెండు చేతులకు వేళ్లు లేని పక్షంలో ఎడమ, కుడి చేతుల పైభాగంలో సిరాచుక్క పెడతారు.


