పాలమూరులో అధికార పార్టీ జోరు
పాలమూరు: జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభీ మోగించింది. ఐదు మండలాల్లో పూర్తిగా పైచెయ్యి సాధించగా కోయిలకొండ మండల పరిధిలో మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీగా స్థానాలు కై వసం చేసుకున్నాయి. హన్వాడ మండల పరిధిలో అయితే కాంగ్రెస్ పూర్తిగా వన్‌సైడ్‌గా విక్టరీ నమోదు చేసుకున్నాయి. మిగిలిన మిడ్జిల్, దేవరకద్ర, సీసీకుంట, కౌకుంట్ల మండలాల్లో కూడా అదేవిధంగా దూసుకుపోయింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో మండలాల వారీగా..
మండలాలు జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
/స్వతంత్ర
చిన్నచింతకుంట 18 12 4 2 0
దేవరకద్ర 18 11 4 0 3
కౌకుంట్ల 12 10 2 0 0
హన్వాడ 35 25 4 5 1
కోయిలకొండ 44 25 17 1 2
మిడ్జిల్ 24 16 8 0 0
మొత్తం 151 98 39 8 6


