బ్యాలెట్లో కనిపించని అభ్యర్థి గుర్తు
వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల పంచాయతీ అనుబంధ గ్రామం గొల్లోనిపల్లి(10వ వార్డు) పోటీచేసిన అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్లలో లేకపోవడంతో కలకలం రేపింది. 10వ వార్డులో మొత్తం 161 ఓట్లు ఉండగా 12 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థి యాద మ్మ ఓటు వేయడానికి రాగా బ్యాలెట్‌లో తనకు కేటాయించిన గుర్తు లేకపోవడాన్ని గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశా రు. వెంటనే ఎన్నికల అధికారులు ప్రిసైడింగ్ అధికారి ద్వారా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ముందు వేసిన ఓట్లను ఏజెంట్ల సమక్షంలో చించివేశారు. దాదాపు గంటపాటు పోలింగ్‌ను నిలిపివేసి తిరిగి కొత్త బ్యాలెట్ పత్రాలను తీసుకువచ్చి 12 మంది ఓటర్లతో మళ్లీ ఓటు వేయించడంతో వివాదం సద్దుమణిగింది. చివరికి సద రు అభ్యర్థి ఓటమి పాలు కావడం గమనార్హం.


