అత్యధికం.. అత్యల్పం
గద్వాల జిల్లాలో ధరూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారుడు డీఆర్ విజయ్ కుమార్ 2,616 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. గంగిమాన్‌దొడ్డిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఒక ఓటు తేడాతో విజయం సాధించారు.
నారాయణపేట జిల్లా గుండుమాల్‌లో కాంగ్రెస్ మద్దతుదారురాలు దడ తిరుపతమ్మపై కాంగ్రెస్ రెబల్‌గా పోటీచేసిన గొల్ల శ్రీశైల అత్యధికంగా 1,360 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇదే మండలం అమిన్‌కుంట్లలో కాంగ్రెస్ మద్దతుదారు వినోద 9 ఓట్లతో వెంకటయ్య (కాంగ్రెస్ రెబల్)పై గెలిచారు.
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం సోళీపురంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సింధూజ విజయం సాధించింది.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (కాంగ్రెస్) సొంతూరు సల్కెలాపురంలో బీఆర్‌ఆర్ మద్దతుదారు గుళ్ల గిరమ్మ ఏడు ఓట్లతో గెలుపొందింది.
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో కాంగ్రెస్ బలపరిచిన గోనెల రమేష్‌పై బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతుదారుడు రామకృష్ణ అత్యధికంగా 1,104 ఓట్లతో విజయం సాధించారు. రామకృష్ణకు 1,739 ఓట్లు రాగా.. గోనెల రమేష్‌కు 635 ఓట్లు పోలయ్యాయి. ఇదే మండలం ఈదుగానిపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు వెంకటేశ్వర్‌రెడ్డిపై బీజేపీ, బీఆర్‌ఎస్ మద్దతుదారుడు గణేష్ యాదవ్ అత్యల్పంగా 13 ఓట్లతో విజయం సాధించారు.
అనిరుధ్‌రెడ్డి సొంత మండలం రాజాపూర్‌లో 24 జీపీలకు ఎన్నికలు జరగగా.. 15 పంచాయతీల్లో సర్పంచ్‌లుగా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కేవలం నాలుగు గ్రామాలోన్లే కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. అంతేకాదు ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి గూడ సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు రేవతి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది.
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
అత్యధికం.. అత్యల్పం


