పోలింగ్ నిర్వహణకు 88 రకాల సామగ్రి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఎన్నికల నిర్వహణలో అధికారులు, అభ్యర్థులు, ఓటర్లు అనే పదాలు తరచూ వింటుంటాం. వీటితోపాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, వేలికి అంటించే సిరా మాత్రమే గుర్తుకొస్తాయి. ఇవేగాక సూది, దారం, కొవ్వొత్తులు, అగ్గిపెట్టె, పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు, అట్టలు, సీల్ వేసేందుకు లక్క, బ్యాలెట్ పేపర్లు చింపేందుకు స్కేలు, బ్యాలెట్ బాక్కులకు వేసేందుకు సంచులు, స్టీల్ పెట్టెలు ఇలా చెప్పుకొంటు పోతే మొత్తంగా 88 రకాల సామగ్రి వినియోగిస్తారు.
పోలింగ్‌కు వినియోగించే సామగ్రి


