జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
కల్వకుర్తి రూరల్: మండలంలోని తర్నికల్ సమీపంలోని బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. పత్తిని జిన్నింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్య్యూట్‌తో పత్తి అంటుకొని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది, రైతులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. అప్రమత్తంగా ఉండడంతో పెద్ద నష్టం తప్పింది. నష్టం తీవ్రత తక్కువగానే ఉందని జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్ తెలిపారు. జిన్నింగ్ మిల్లును ఎస్‌ఐ మాధవరెడ్డి సందర్శించారు.


