చిత్రవిచిత్రాల పొత్తులు
నారాయణపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. చిత్రవిచిత్ర పొత్తులతో ఓటర్ల ముందుకెళ్తున్న అభ్యర్థులను ఏ పార్టీ అని ఓటర్లు అడిగితే ముక్కున వేలేసుకుంటున్నారు. గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎవరికి వారు తమ నాయకుడంటే.. తమ నాయకుడిని గెలిపించాలంటూ ఎవరి పార్టీల్లో వారు ప్రచారం హోరెత్తించారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో మాత్రం తమకు అనుకూలమైన పార్టీలతో పొత్తు పెట్టుకొని పోరులో నిలవడాన్ని ఓటర్లు తప్పుబడుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఎక్కడా కనిపించడం లేదని.. ఎవరు గెలుస్తారో వారికే వంతు పాడే వారు ఏం లీడర్లంటూ మొఖంపైనే ఓటర్లు చెబుతుండటాన్ని అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీచేసే అభ్యర్థులు తమ పార్టీ వారే అయినా.. తమకు పడదంటూ మరో పార్టీకి మద్దతునివ్వడం పల్లె పోరులో చర్చనీయాంశంగా మారింది.
పల్లె పోరులో ఒక్కటైన ప్రధాన పార్టీలు
తమ పార్టీ కండువాలతో ప్రచారం
బిత్తరపోతున్న ఓటర్లు
ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరికి వారే ప్రచారం
స్థానిక ఎన్నికల్ల్లో మాత్రం పొత్తులతో ప్రజల్లోకి..


