రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆత్మకూర్: మితిమీరిన అతివేగం, నిర్లక్ష్యపు ప్రయాణంతో యువకుడి మృతి చెందగా భార్య, నలుగురు పిల్లలు అనాథలుగా మారిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ జయన్న తెలిపిన వివరాలు.. నర్వ మండలం రాయికోడ్‌కి చెందిన తెలుగు నవీన్‌కుమార్(32) అమరచింతలో తమ బంధువులను కలసి ఆత్మకూర్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో పట్టణ శివారులోని పెట్రోల్ బంక్ మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శరణ్యతో పాటు నలుగురు కుమారులు ఉన్నారు. చిన్నబాబు పుట్టి 20 రోజులు అవుతుందని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
నవీన్‌కుమార్(ఫైల్)


