చికిత్స పొందుతూ యువకుడి మృతి
వెల్దండ: మండలంలోని రాఘవాయపల్లి గేట్ వద్ద హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. ఆమనగల్లు మండలం చంద్రాయన్‌పల్లితండాకు చెందిన జటావత్ ఛత్రపతి(21) కల్వకుర్తిలోని ప్రిటింగ్‌ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. పనిముగించుకొని శనివారం రాత్రి 11గంటలకు ఆమనగల్లుకు ఆరీఫ్, సమీర్‌తోపాటు బైక్‌పై వెళ్తుండగా రాఘవాయపల్లిగేట్ వద్ద ఎన్ హె చ్‌పై కల్వకుర్తి వైపు వస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఛత్రపతి, అరీఫ్, సమీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్రపతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హెదరాబాదులోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి బాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


