కాబోయే సర్పంచ్‌కు యువత డిమాండ్లు
కాబోయే సర్పంచ్ గ్రామంలో నెలకొన్న సమస్యలు, గ్రామాభివృద్ధిలో చేపట్టాల్సిన పనులపై ఆదివారం మండలంలోని గంగాపూర్ గ్రామ యువత డిమాండ్లతో కూడిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ముఖ్యంగా క్రీడాకారులకు మైదానం, విద్యార్థుల కోసం గ్రంథాలయంతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్, ప్రహరీ నిర్మాణం, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని వాల్‌పోస్టర్‌లో పేర్కొన్నారు. అలాగే పంచాయతీ నిధులను పారదర్శకంగా వినియోగించాలని, నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వాలని, గ్రామంలో మద్యం, సిగరెట్ల అమ్మకాలు నిషేధించాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. – జడ్చర్ల


