కబడ్డీ చాంపియన్ వనపర్తి
● ఉత్కంఠ పోరులో హైదరాబాద్–2 జట్టుపై విజయం
● మూడోస్థానంలో నారాయణపేట, హన్మకొండ జట్లు
● ముగిసిన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ టోర్నమెంట్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన 51వ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా బాలుర జూనియర్ కబడ్డీ చాంపియన్‌గా వనపర్తి జిల్లా జట్టు నిలిచింది. రన్నరప్‌గా హైదరాబాద్– 2 జట్టు, మూడో స్థానంలో నారాయణపేట, హన్మకొండ జట్లు నిలిచాయి.
హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్
వనపర్తి– హైదరాబాద్–2 జట్ల మధ్య హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ కొనసాగింది. మొదటి అర్ధభాగంలో 23– 17 పాయింట్ల తేడాతో లీడ్‌ను వనపర్తి జట్టు కొనసాగించింది. ఉత్కంఠంగా సాగిన రెండో అర్ధ భాగంలో 40– 38 పాయింట్ల తేడాతో వనపర్తి జట్టు విజయం సాధించి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది.
సెమీఫైనల్ మ్యాచ్‌ల వివరాలు
అంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరిగాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో వనపర్తి జట్టు 45– 40 పాయింట్ల తేడాతో నారాయణపేట జట్టుపై, హైదరాబాద్–2 జట్టు 60–28 పాయింట్ల తేడాతో హన్మకొండ జట్లపై గెలుపొందాయి.
భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో చోటు
జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శాంతికుమార్ మాట్లాడుతూ కబడ్డీకి రోజురోజుకూ ఎంతో ఆదరణ పెరిగిందన్నారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో కబడ్డీకి చోటు లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 2030లో అహ్మదాబాద్‌లో జరిగే కామన్‌వెల్త్ క్రీడలో కబడ్డీ చోటు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్ కబడ్డీకి పూర్వ వైభవంగా వస్తుందన్నారు. క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యమన్నారు. జిల్లాకు రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ కేటాయించినందుకు రాష్ట్ర సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్‌పీ వెంకటేశ్ మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గత రెండేళ్ల నుంచి జిల్లాలో ఎన్నో రాష్ట్రస్థాయి టోర్నీలు జరిగాయన్నారు. జేపీఎన్‌సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీరామజయరామ కంపెనీ అధినేత బెక్కరి రాంరెడ్డి, టోర్నీ రాష్ట్ర పరిశీలకులు నర్సింగ్‌రావు, జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, కోశాధికారి ఉమామహేశ్వర్‌రెడ్డి, మల్లేష్‌యాదవ్, పడాకుల బాలరాజు, పద్మజారెడ్డి, జాకీర్ అడ్వకేట్, రామచంద్రయ్య, రాములు, చెన్నవీరయ్య, రజనీకాంత్‌రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ చాంపియన్ వనపర్తి


