పంచాయతీలు..ఆర్థిక వనరులు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు
సాధారణ, సొంతపన్నుల రూపంలో
మరింత తోడ్పాటు
● ఉపాధిహామీ పథకంలో పలు అభివృద్ధి పనులు
కల్వకుర్తి టౌన్: గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నేరుగా అందనున్నాయి. వీటితో పాటు గ్రామాల్లో సొంతంగా సేకరించే సాధారణ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టే వీలుంటుంది. జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. వాటితోనే అభివృద్ధి పనులు ఆయా గ్రామాల పాలకులు చేపడతారు. గ్రామపంచాయతీలు సొంతంగా వసూలు చేసే పన్నులు, సాధారణ ప్రణాళికతో అమలు చేసి వసూలు చేసే నిధులు సైతం గ్రామాభివృద్ధికి ఊతాన్నిస్తాయి.
గ్రామపంచాయతీల పరిధిలో జనాభాకు తగినట్టుగా పలురకాల పన్నులతో పాటు సాధారణ ప్రణాళికను రూపొందించి నిధులు పెంచుకుంటాయి. గ్రామాల్లో నిర్వహించే పశువుల సంతలు, రైతుబజార్లు, ఇతర పన్నులతో పాటు ఇంటిపన్ను, ఇంటి నిర్మాణ అనుమతి, మ్యుటేషన్, కొళాయి బిల్లులు, లైబ్రరీ సెస్, పలువురు దాతలు అందించే ఆర్థిక సాయం ఈ పరిధిలోకి వస్తాయి. వీటితోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయి.
పంచాయతీలు..ఆర్థిక వనరులు


