మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
మరికల్: ఓ మతిస్థిమిత్తం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన 15 రోజుల తర్వాత అప్పంపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మాలే గోవర్ధన్‌రెడ్డి (43) గతంలో అప్పులు చేసి పొలంలో ఐదు బోర్లు వేశాడు. అయినా నీళ్లు పడకపోవడంతో ఆర్థిక సమస్యలతో మతిస్థిమితం కోల్పోయడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. అయితే శుక్రవారం సాయంత్రం గ్రామంలోని పాడుబడ్డ బావి పక్కన దుర్వాసన రావడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా మొండెం, ఎముకలను కుక్కలు పీక్కుతినడంతో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించి గోవర్ధన్ రెడ్డి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు దుస్తులను గుర్తు పట్టి బోరున విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.


