కనువిందు చేసిన పెద్ద పులి
మన్ననూర్: అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మహణలో ఉన్న టైగర్ సఫారీతో పర్యాటక ప్రియులకు నల్లమల పులుల రక్షిత అభయారణ్యంలో తరుచుగా పులులు దర్శనమిస్తున్నాయి. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ వద్ద నుంచి అటవీ సరిహద్దు ప్రాంతం గుండ సఫారీలో వెళ్లుతున్న పర్యాటకులకు గుండం సమీపంలో ఒకే పులి రెండుసార్లు కనిపించింది. పులి ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. ఫైలెట్ యాదయ్య, నేచర్ గైడ్ అఖిల్ పర్యాటకులకు రిజర్వ్ ఫారెస్టులోని పులుల వివరాలు తెలియజేశారు.


