గిట్లయితే.. ఎన్నికలొద్దు
● ఎర్రవల్లిలో ఆర్‌అండ్‌ఆర్
ప్యాకేజీని రద్దు చేయాలంటూ గ్రామస్తుల రిలేదీక్ష
● ప్రశాంతినగర్‌లో ఎస్టీలకు ‘సర్పంచ్’ రిజర్వ్ కావడంపై ఆందోళన
చారకొండ/మన్ననూర్: ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని రద్దు చేయాలంటూ ఎర్రవల్లిలో.. వంద శాతం ఎస్సీలు ఉన్న గ్రామంలో ఎస్టీలకు సర్పంచ్ పదవి రిజర్వ్ కావడాన్ని నిరసిస్తూ ప్రశాంతినగర్‌లో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. చారకొండ మండలం ఎర్రవల్లిలో పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. గోకారం జలాశయ సామర్థ్యం తగ్గించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ గత నాలుగు రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రకియ కొనసాగుతుండగా.. ఎర్రవల్లిలో సర్పంచ్, వార్డుసభ్యులకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. తమ డిమాండ్లపై అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మూడోరోజైన శుక్రవారం సైతం గ్రామస్తులు ఎవరూ నామినేషన్‌లో పాల్గొనలేదు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని రద్దు చేసి ఆమేరకు జీఓ జారీ చేసేవరకు పోరాటం చేస్తామని నిర్వాసితులు, గ్రామస్తులు పేర్కొన్నారు.
ప్రజాసేవకై స్వదేశానికి..
ఎర్రవల్లి: మండలంలోని కొండేరుకు చెందిన సోమనాద్రి సతీమణి శ్రీహరిత వృత్తిరీత్యా దంత వైద్యురాలు. పలుచోట్ల ప్రజలకు సేవలు అందించిన ఆమె.. కుటుంబంతో కలిసి కొన్నేళ్లుగా లండన్‌లో స్థిరపడ్డారు. భర్త సోమనాద్రి (ఎన్నారై)తో కలి సి గ్రామ ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో ఇటీవల లండన్ వదిలారు. వైద్యవృత్తిని సైతం పక్కనబెట్టి ప్రజాసేవ చేసేందుకు సర్పంచ్‌గా బరిలో నిలిచారు. ఈ మేరకు శుక్రవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజలు ఆదరించి తనను గెలిపిస్తే ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధితో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
గిట్లయితే.. ఎన్నికలొద్దు


