అట్టహాసంగా..!
శ్రీనివాసులు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శుక్రవారం 51వ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా బాలుర జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా 34 బాలుర జట్లు పాల్గొన్నాయి. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా క్రీడాజట్ల మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శాంతికుమార్ తదితరులు క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. బాలానగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల బ్యాండ్‌ట్రూప్ అలరించింది. బ్యాండ్‌ట్రూప్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అదే విధంగా బాలికల నృత్య ప్రదర్శనలు అలరించాయి. టోర్నీలో మల్లేశ్‌యాదవ్ వ్యాఖ్యానం ఆకట్టుకుంది. మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్న ఒక్కో జిల్లా జట్టు చరిత్ర గురించి ఆయన చక్కగా వివరించారు.


