ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలి

Dec 6 2025 9:03 AM | Updated on Dec 6 2025 9:03 AM

ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలి

ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలి

గద్వాల క్రైం: గద్వాల పట్టణంలోని ఎస్టీ బాలుర సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని లోకాయుక్త శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీన గద్వాలలోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో అల్పాహారం తిన్న 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. ఈమేరకు 3వ తేదీన ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని లోకాయుక్త సుమోటాగా విచారణకు స్వీకరించింది. విద్యార్థుల ఆరోగ్య వివరాలు, ఫుడ్‌పాయిజన్‌కు గల కారణాలు, బాధ్యులు, హాస్టల్‌లో సురక్షితమైన భోజన వసతి తదితర విషయాలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌, సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన నివేదిక సమర్పించాలని పేర్కొంటూ.. ‘సాక్షిశ్రీలో వచ్చిన కథనాన్ని ట్యాగ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement