సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వ్ కావడంపై..
ఇక మన్ననూర్ మండలం ప్రశాంతినగర్ గ్రామంలోనూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు శుక్రవా రం ప్రకటించారు. వంద శాతం ఎస్సీలు (దళితులు) నివసిస్తున్న గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు పంచాయతీ కార్యాలయం ఎదుట సమావేశమైన అన్ని పార్టీలకు చెందిన నాయకులు, యువకులు స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు నినాదాలు చేశారు. పలువురు మాట్లాడుతూ.. గతంలో మన్ననూర్ గ్రామంలో ఆమ్లెట్ విలేజ్‌గా ఉన్నప్పుడే బాగుండేదని, ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసి మమ్మల్ని, మా గ్రామాన్ని వెలివేసిట్లుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఇప్పటి వరకు ఏ ఒక్క సౌకర్యం గ్రామంలో కల్పించలేదని, గ్రామ పంచాయతీ కార్యాలయం కమ్యూనిటీ భవనంలో కొనసాగుతుండగా.. గ్రామానికి గ్రామ కార్యదర్శి పోస్టు మినహాయిస్తే మరే సౌకర్యం కల్పించకపోవడం దురదృష్టమన్నారు. గ్రామంలో 100 శాతంగా ఉన్న ఎస్సీలకు అనుకూలంగా సర్పంచ్ పదవి ఎస్సీలకే కేటాయించాలని, లేని పక్షంలో గతంలో మాదిరిగా మన్ననూర్ గ్రామంలోనే ఆమ్లెట్ విలేజ్‌గా కొనసాగించాలని డిమాండ్ చేశారు.


