బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలి

Dec 6 2025 8:51 AM | Updated on Dec 6 2025 8:51 AM

బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలి

బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలి

36 డీసీసీ అధ్యక్షుల్లో 16 బీసీలకే ఇచ్చాం

సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ పార్టీని బూత్‌స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో డీసీసీ అధ్యక్షుడిగా ఎ.సంజీవ్‌ ముదిరాజ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన నివాసం నుంచి పార్టీ కార్యాల యం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథి గా పాల్గొన్న వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా లోని ప్రతి గ్రామానికి తిరిగి పార్టీ బలోపేతం కోసం నూతన డీసీసీ అధ్యక్షులు ముందుండి పనిచేయా లని కోరారు. సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ ద్వారా దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసినట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 36 డీసీసీ అధ్యక్షుల్లో 16 మంది బీసీలను నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 36 డీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తూ 80.6 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.

● బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లి పోరాడుదామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు అన్నారు. రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ సంజీవ్‌ ముదిరాజ్‌ తీసుకునే నిర్ణయంలో తన సహకారం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉండడం వల్ల సర్పంచ్‌ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారని, వారితో సమన్వయం చేయాలని డీసీసీ అధ్యక్షుడిని కోరారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అందరు కలిసికట్టుగా పనిచేసి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ 30ఏళ్ల నుంచి పార్టీలో తే సేవలను గుర్తించి డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఏఐసీసీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. రీబ్‌ హటావో, రోటి, కపడా, మకాన్‌ అనే ఇందిరాగాంధీ సిద్ధాంతాలు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు.తన శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్‌ పార్టీ, ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. టీజీఎంఎఫ్‌సీ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. సంజీవ్‌ను రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement