గుర్తుల కేటాయింపులో జాగ్రత్త
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత తుది పోటీ అభ్యర్థుల జాబితా (ఫారం–9) తయారీతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియ లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి మొదటి దశ , రెండవ దశ ఎన్నికలు జరిగే మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓ లు, స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఇప్పటికే తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో గుర్తుల కేటాయింపునకు అభ్యర్థుల పేర్లలోని అక్షరాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని గుర్తులు కేటాయించాలని సూచించారు. ఎక్కడైనా ఏమైన లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. ఎంపీడీఓలు బ్యాలెట్ బా క్సులు, పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 8న పీఓలు, ఓపీఓలకు మరోసారి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. 11న జరిగే తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు సిబ్బంది సిద్ధంగా ఉండేలా చూడాలన్నా రు. ఎన్నికల నిర్వహణలో తలెత్తే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతా ప్, ఇన్‌చార్జి డీపీఓ వెంకట్‌రెడ్డి, ట్రెయినీ డీపీఓ నిఖి ల, ఆర్డీఓ నవీన్, మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్ ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీల్లో ఓటరుగా ఉండి.. ఎన్నికల విధులు నిర్వరిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ విజయేందిర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫారం–14తో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కల్పించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల ఉద్యోగులకు మరో అవకాశం కల్పిస్తూ ఎంపీడీఓ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోలేని వారు ఫారం–14తో నేరుగా తమ ఓటు హక్కు ఉన్న మండల పరిషత్ కార్యాలయంలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ సదుపాయం మొదటి విడత ఎన్నికలు జరిగే గండేడ్, మహమ్మదాబాద్ నవాబుపేట, రాజాపూర్, మహబూబ్‌నగర్ మండలాల్లో ఈ నెల 8న ఉదయ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, కోయిలకొండ, మిడ్జిల్ మండలాల్లో 12న, మూడో విడతలో ఎన్నికలు జరిగే అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల్లో 15వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎన్నికల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


