54 జీపీలకు ఒకే పీహెచ్‌సీ
నవాబుపేట: మా కూతరు డెలివరీకి వచ్చింది.. పదా పాలమూరుకు అనే రోజులు నవాబుపేట మండలంలో కనిపించవు.. డెలివరీ వచ్చిందంటే చాలు నవాబుపేట పీహెచ్‌సీ అన్నట్లు మారింది పరిస్థితి. నవాబుపేట పీహెచ్‌సీలో గతేడాదిలో 291 డెలివరీలు చేసి జిల్లాలోనే రికార్డు సృష్టించి మొదటిస్థానంలో నిలిచింది. తాజాగా ఈ ఏడాది సైతం ఇప్పటికే 250 డెలివరీలు దాటేసింది. దీంతో ఇక్కడి సిబ్బంది పనితీరు జిల్లాస్థాయిలో నిలిచింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మండలంలో ఒకే ఒక్క పీహెచ్‌సీ ఉండటం సిబ్బందికి భారంతోపాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. 54 గ్రామాలకు 76, 981మంది జనాభాకు ఒకేఒక్క పీహెచ్‌సీ ఉండటం విడ్డూరం. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పీహెచ్‌సీకి ఎటూ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు చిన్నచిన్న వాటికి 12 కిలోమీటర్ల దూరం రావాల్సిందే. పైగా ఇక్కడ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవడంతో ప్రతిదానికి జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. 25ఏండ్ల క్రితం ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలోనే రికార్డుస్థాయిలో ఆపరేషన్‌లు చేసి మొదటిస్థానంలో నిలిచిన చరిత్ర ఉంది. కాని కుని నిలిపివేయడంతో ఇబ్బందులు వచ్చిపడ్డాయి. రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉన్న తండాలు, మారుమూల గ్రామాల పరిస్థితి మరింత దారుణం. ఇలాంటి పరిిస్థితుల్లో ఏండ్ల తరబడి ఒకేఒక్క పీహెీచ్‌సీతో కాలం గడుపుతున్న మండలం దినదినం అభివృద్ధి చెందుతున్నా.. అదనపు పీహెచ్‌సీ మాత్రం నోచుకోలేదు. నిబంధనల ప్రకారం 25వేల జనాభాకు ఒక్క పీహెచ్‌సీ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అట్టి నిబంధనల ప్రకారం మండలంలో మరో 3పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
● గ్రామాల్లోని సబ్‌సెంటర్లను సిబ్బంది కొరత తీవ్రంగా వేదిస్తోంది. సబ్‌సెంటర్లలో సిబ్బంది లేకుంటే చాలా ఆందోళన కలిగించే అంశం. మొత్తం 11 సబ్‌సెంటర్లలో ఆరుగురు ఏఎన్‌ఎంలు లేకపోవడంతో 2వ ఏఎన్‌ఎంలతో కాలం గడుపుతున్నారు. ప్రధానంగా కొల్లూర్, రుద్రారం, ఇప్పటూర్, చౌడూ ర్, లింగంపల్లి, నవాబుపేట సబ్‌సెంటర్ల పరిధిలోని ఇన్‌చార్జీలు ఖాళీగా ఉన్నారు. ఇద్దరు డాక్టర్లు ఉండాల్సిన పీహెచ్‌సీలో ఒకేఒక్క కాంట్రాక్టు డాక్టర్ ఉన్నాడు. అలాగే ఒక ఎంపీహెచ్‌ఓ, ఒక సూ పర్‌వైజర్, ఒక స్టాఫ్‌నర్స్ ఫోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కాన్పుల్లో రికార్డు..
కు.ని ఆపరేషన్లకు నో చాన్స్
దూరాభారంతో తండాలు,
మారుమూల ప్రజలకు ఇక్కట్లు
గ్రామాల్లోని సబ్‌సెంటర్లనూ వేధిస్తున్న స్టాఫ్‌నర్సులు, సిబ్బంది కొరత
కారుకొండలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి
మండలంలోని మేజర్ గ్రామాల్లో ఒకటైన కారుకొండలో పీహెచ్‌సీ చాలా అవసరం. చాలా ఏండ్ల నుంచి ఇక్కడ సబ్‌సెంటర్ కొనసాగుతుంది. కాగా జనాభా ప్రకారం ఇక్కడ చాలా మారుమూల గ్రామాలకు మధ్యలో పెద్ద గ్రామం కావడంతో అన్నిరకాల సదుపాయాలు ఉంటాయి. లేకుంటే ప్రతి విషయానికి మండల కేంద్రం, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది.
– పాండురాజ్, హజిలాపూర్
పీహెచ్‌సీల ఏర్పాటుపై
దృష్టిసారించాలి
మండలంలో జనాభాను దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీల ఏర్పాటుపై జిల్లా అధికారులు దృష్టిసారించాలి. అలాగే ఇక్కడ పీహెచ్‌సీలో కుటుంబ నియంత్ర ఆపరేషన్లకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు వివరించాం. ఆస్పత్రిలో సదుపాయలు, సిబ్బంది తదితర ఏర్పాట్లు చేసి ఆపరేషన్‌లకు సిద్ధం చేయాలి. ప్రతినెలా కుటుంబ నియంత్రణ శిబిరాల కోసం వైద్యసిబ్బందికి కొంత ఇబ్బంది తప్పదు. డెలవరీలు మాత్రం టార్గెట్‌కు మించి జరిగేలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
– శ్రావణ్‌కుమార్,
మండల వైద్యాధికారి
54 జీపీలకు ఒకే పీహెచ్‌సీ
54 జీపీలకు ఒకే పీహెచ్‌సీ


