నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిమితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధలన మేరకు ఖర్చు చేయాలని పంచాయతీ ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి టైటస్‌పాల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందు ఎన్నికల ప్రచార ఖర్చు నిర్వహించేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏదేని బ్యాంకులో జిల్లాలో ఎక్కడైనా తెరవాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి లేక అతని/ఆమె ఎన్నికల ఏజెంట్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు. ప్రచారానికి చేసే ప్రతి ఖర్చు కూడా బ్యాంకు అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసి నిర్వహించాలని పేర్కొన్నారు. రూ.5వేలకు మించి ఎన్నికలు ప్రచార ఖర్చు నగదు లావాదేవీలు జరపరాదని తెలిపారు. పోటీ చేయు అభ్యర్థి లేదా అతని ఏజెంట్ దగ్గర రూ.10వేల నగదు కలిగి ఉండరాదని వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు స ర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు రూ.2లక్షల50వేల వరకు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.50వేల వరకు గరిష్ట పరిమితి వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. 5వేలలోపు జనాభా ఉన్న గ్రామాల్లో రూ.లక్షా50 వేల వరకు, వార్టు మెంబర్ అభ్యర్థి రూ.30వేల గరిష్ట పరిమితి వరకు ఖర్చు చేయ వచ్చని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు నిర్ధారించిన నమూనా ఫారాలతో అనుమతించిన ఖర్చును మాత్రమే నమోదు చేయాలని పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థులందరు ఎన్నికల కొరకు ప్రారంభించిన బ్యాంకు ఖాతా నుంచి ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ, క్రాస్ చెక్కుతో చెల్లింపులు జరపాలని పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, సెక్షన్ 237 ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45రోజుల్లోగా సంబంధిత ఎంపీడీఓ నిర్ణయించిన ఫార్మాట్‌లో సమర్పించాలని, లేకుంటే ఎన్నిక రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఒక్క క్లిక్‌తో
ఓటరు జాబితా ప్రత్యక్షం
పాలమూరు: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచింది. సదరు వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా జాబితాను చూడవచ్చు. డౌన్‌లోడ్ సైతం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా తుది జాబితాను చూసుకోవచ్చు. final rolls GP/ward wise voter list an on 02-09-2025 ఆప్షన్‌ను క్లిక్ చేసి మండలం, జీపీ ఎంచుకుంటే ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. క్యాప్చా కోడ్‌ను సక్రమంగా ఎంటర్ చేసి వార్డు వైజ్ డేటాపై క్లిక్‌చేస్తే మీ గ్రామ పంచాయతీలోని వార్డుల వైజ్‌గా ఓట రు లిస్ట్ వస్తోంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇలా ఓటరు జాబితాను సులభంగా చూసుకోవచ్చు.
సర్పంచ్ నామినేషన్
ఫీజు రూ.2వేలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్):సర్పంచ్‌కి పో టీ చేసే అభ్యర్థులు(జనరల్) రూ.2వేల నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే రిజర్వ్‌డ్ స్థానాల్లో (ఎస్సీ, ఎస్టీ) పోటీ చేసే అభ్యర్థులు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. అదే జనరల్ స్థానంలో పోటీ చేసే వార్డు సభ్యులు రూ.500 నామినేషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌డ్ స్థానంలో రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
నిబంధనల మేరకే ఖర్చు చేయాలి


