రోడ్డుప్రమాదంలో మామ, అల్లుడి దుర్మరణం
వనపర్తి రూరల్: బైక్ వెళ్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా కా రు ఢీకొని మామ, అల్లుడు దుర్మరణం చెందిన ఘటన పెబ్బేరు మండలంలో ఎన్‌హెచ్ 44పై రంగాపురం బైపాస్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యుగేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేశ్(50), అల్లుడు ప్రవీణ్ కుమార్(32) బైక్‌పై బుధవారం మధ్యాహ్నం డబ్బులు తీసుకోవడానికి పెబ్బేరు వెళ్తున్నారు. జాతీయ రహదారిపై కర్నూల్ బైపాస్ వద్ద పెబ్బేరులోకి క్రాస్ అవుతుండగా.. హైదరాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టడంతో మామ, అల్లుడికి బలమైన గాయాలు కావడంతో హైవే అంబులెన్స్‌లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకు న్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. రమేశ్‌కు భార్య లక్ష్మి, ముగ్గురు కూతుళ్లు, ప్రవీణ్‌కుమారుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మామ, అల్లుడి మృతితో గ్రా మంలో విషాఛాయలు అమలుకున్నాయి. ఘటనపై రమే శ్ భార్య అలివేల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై
మాట తప్పిన కాంగ్రెస్
మెట్టుగడ్డ: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట తప్పిందని, బీసీలను మరో మారు మోసం చేసిందని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌సాగర్ అన్నారు. బీసీ సమాజ్ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నేడు మాట తప్పి బీసీలను నయ వంచనకు గురి చేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లు కల్పి ంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని, నేడు 46జీఓను తీసుకొచ్చి 17.8 శాతానికి పరిమితం చేసి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం తగిన బుద్ది చెప్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, మహబూబ్‌నగర్ కన్వీనర్ దుర్గేష్, దేవరకద్ర కన్వీనర్ శేఖర్ పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో మామ, అల్లుడి దుర్మరణం


