గుట్టకాయ స్వాహా..! | - | Sakshi
Sakshi News home page

గుట్టకాయ స్వాహా..!

Nov 15 2025 11:22 AM | Updated on Nov 15 2025 11:22 AM

గుట్ట

గుట్టకాయ స్వాహా..!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అధికార నేతల అండదండలతో పగలు, రాత్రనక సహజ సంపదను కొల్లగొడుతోంది. ఎర్రమట్టి, మొరం కోసం గుట్టలను కేరాఫ్‌గా చేసుకుని అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. భారీ వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తోంది. అవినీతికి అలవాటు పడిన పలు శాఖలు పట్టించుకోకపోవడంతో పాలమూరు క్రమక్రమంగా తన ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్‌..

రాత్రిళ్లు దందా..

షరా‘మామూలు’

నిబంధనల ప్రకారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులు పర్మిషన్లు తీసుకోకుండా.. అది కూడా చాలా చోట్ల రాత్రివేళ సైతం మట్టి దందా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాతే తవ్వకాలు చేపట్టి భారీ వాహనాల్లో తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందినవారే. వీరికి అధికార నేతలు అండగా నిలవడంతో ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌, రవాణా, మైనింగ్‌ శాఖకు వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోజు, నెల వారీగా మామూళ్లు అందు తుండడంతోనే వారు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆనవాళ్లు కోల్పోతున్నపాలమూరు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్న మాఫియా

ఎర్రమట్టి, మొరం కోసం అడ్డగోలు తవ్వకాలు

రాజకీయ నేతల అండతో యథేచ్ఛగా దందా

రాయల్టీ ఎగవేతతో సర్కారు ఆదాయానికి గండి

మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖపై విమర్శలు

గుట్టకాయ స్వాహా..!1
1/1

గుట్టకాయ స్వాహా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement