క్రీడాకారులు జాతీయసా్థయికి ఎదగాలి
● జిల్లా యువజన, క్రీడల అధికారిఎస్.శ్రీనివాస్
● ఉత్సాహంగా అస్మితా అథ్లెటిక్స్ లీగ్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా క్రీడాకారులు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని డీవైఎస్‌ఓ ఎస్.శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి అస్మితా ఖేలో ఇండియా లీగ్‌లో భాగంగా అండర్–14, 16 బాలికలకు వివిధ అథ్లెటిక్స్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత విభాగంలో అథ్లెటిక్స్ ఈవెంట్స్‌కు ఎంతో గుర్తింపు ఉందన్నారు. నిరంతరం ప్రాక్టీస్ చేస్తే విజయం సాధించవచ్చని అన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లీగ్ పరిశీలకులు అథ్లెటిక్ శాయ్ కోచ్ విద్యాసాగర్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి పుట్టి సురేష్‌చందర్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర, డీఎస్‌ఏ అథ్లెటిక్స్ కోచ్ సునీల్‌కుమార్, పీడీలు పి.శ్రీనివాస్, సి.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
గెలుపొందిన క్రీడాకారులు..
అండర్–16 విభాగం 600మీ.లో మౌనిక (ప్రథమ), సింధూజ (ద్వితీయ), అలకానంద (తృతీయ), 60 మీ.లో శ్రీజ (ప్రథమ), అక్షయ (ద్వితీయ), పి.సంధూజ (తృతీయ), జావెలిన్‌త్రోలో ఇందు (ప్రథమ), పరమేశ్వరి (ద్వితీయ), భార్గవి (తృతీయ), లాంగ్‌జంప్‌లో ఈ.భార్గవి (ప్రథమ), అక్షయ (ద్వితీయ), సింధూజ (తృతీయ), హైజంప్‌లో బి.అక్షర (ప్రథమ), జి.భార్గవి (ద్వితీయ), వర్షిత (తృతీయ), షాట్‌పులో డి.ఇందు (ప్రథమ), అక్షర (ద్వితీయ), భార్గవి (తృతీయ), అండర్–14 ట్రై గ్రూప్–ఏలో అశ్విని (ప్రథమ), దీక్షిత (ద్వితీయ), బి.శివాని (తృతీయ), బీలో హిమబిందు (ప్రథమ), జి.చందన (ద్వితీయ), పి.అశ్విని (తృతీయ), సీలో ఎం.సహస్ర (ప్రథమ), ఇందు (ద్వితీయ), కీర్తన (తృతీయ), కిడ్స్ జావెలిన్‌త్రోలో ఎం.సహస్ర (ప్రథమ), అస్మితా (ద్వితీయ), దీక్షిత (తృతీయ) సత్తా చాటారు.
క్రీడాకారులు జాతీయసా్థయికి ఎదగాలి


