అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం టీడీగుట్టలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చామని తమ పిల్లలను వాటిలోనే చదివించాలన్నారు. అందరూ ఆరోగ్య బీమా పథకంలో చేరాలని సూచించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలో తైబజార్ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను పరిశీలించారు. అలాగే పద్మావతి కాలనీలోని అయ్యప్పకొండపై కొలువైన శివమార్కండేయస్వామి ఆలయంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జ్ గోనెల శ్రీనివాస్, నాకులు ఎన్‌పీ వెంకటేష్, సిరాజ్‌ఖాద్రీ, చిన్నా, ఉమర్‌పాషా, మునీరుద్దీన్, చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
