గంజాయి విక్రేతల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

Oct 27 2025 8:42 AM | Updated on Oct 27 2025 8:42 AM

గంజాయి విక్రేతల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

గంజాయి విక్రేతల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

నాగర్‌కర్నూల్‌ క్రైం : పట్టణంలోని లాడ్జిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. స్థానిక హరిజనవాడకు చెందిన బొండ్ల రేణుకుమార్‌, ఈశ్వర్‌ కాలనీకి చెందిన మైలగాని సందీప్‌, రాఘవేంద్ర కాలనీకి చెందిన అరకు విశ్వాస్‌, అచ్చంపేట మండలం హాజీపూర్‌కు చెందిన ఎదుల వంశీలు హైదరాబాద్‌లోని దూల్‌పేటలో అకాశ్‌సింగ్‌ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి విక్రయించేవారు. ఈ క్రమంలో ఆదివారం స్థానిక చైతన్య లాడ్జిలో గంజాయి విక్రయించడానికి వెళ్లగా ముందస్తు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి నలుగురు నిందితులతో పాటు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన జిల్లా కేంద్రానికి చెందిన కొత్త వెంకటేష్‌, కొత్త మనోజ్‌ కుమార్‌, తాడూరు మండలం గుంతకోడూరుకు చెందిన ఆది కిష్ణ్రగౌడ్‌, పరేమేష్‌ను అదుపులోకి తీసుకొని వారి నుంచి 735 గ్రా గంజాయి, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్దన్‌ పాల్గొన్నారు.

గంజాయి తీసుకున్న యువకులపై కేసు

జడ్చర్ల: గుట్టుగా గంజాయి తీసుకున్న నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. మండల పరిదిలో ని మాచారం గ్రామానికి చెందిన మరికంటి సుమంత్‌రెడ్డి గంజాయి వినియోగించడం, విక్రయించడం చేస్తున్నాడన్న సమాచారం మేరకు శనివారం గ్రామానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద ఒక ప్యాకెట్‌ గంజాయి లభించడంతో పాటు గంజాయి పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీంతో సుమంత్‌రెడ్డిని విచారించగా జడ్చర్ల టీహోటల్‌ నిర్వాహకుడు అబ్దుల్‌ రహెమాన్‌, మహబూబ్‌నగర్‌లో బీహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్‌ సుబద్‌ కాంత్‌ శర్మ, షాద్‌నగర్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ మిథుకుమార్‌ యాదవ్‌ ద్వారా గంజాయి తీసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో వారిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు నేపాల్‌కు చెందిన సుభాద్‌సింగ్‌ ద్వారా రూ.9,500కు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించడం, తీసుకోవడం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement