కాంచనగుహకు స్వర్ణకాంతులు
● వైభవంగా కురుమూర్తిస్వామి
అలంకారోత్సవం
● మార్మోగిన గోవింద నామస్మరణ
● పూజలు చేసిన మంత్రి వాకిటి శ్రీహ రి,
ఎంపీ డీకే అరుణ , ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
ఆభరణాలను పూజారులకు అందిస్తున్న అధికారులు
ఆత్మకూర్‌లో ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్న భక్తజనం
చిన్నచింతకుంట/ఆత్మకూర్/మదనాపురం/
అమరచింత: పేదల తిరుపతి కురుమూర్తి గిరుల్లో శ్రీనివాసుడు కొలువుదీరిన కాంచనగుహ స్వర్ణకాంతులను సంతరించుకుంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన అలంకారోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పటణంలోని ఎస్‌బీఐ లాకర్‌లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలకు రాష్ట్ర మ త్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మె ల్యే జి.మధుసూదన్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం మేళాతాళాలు, మంగళ వాయిద్యా లు మధ్య ఊరేగింపు ప్రారంభమైంది. ఆలయ సంప్రదాయ ప్రకారం గాడి వంశానికి చెందిన గాడి శేషుచారి స్వామివారి ఆభరణాలను పరమేశ్వరస్వా మి చెరువు వరకు తలపై పెట్టుకుని ఊరేగించారు. అనంతరం పోలీసు కాన్వాయ్‌లో స్వామివారి ఆలయానికి బయల్దేరారు. మదనాపురం మండలం కొ త్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మపూరం గ్రామానికి చేరుకోగా.. గ్రామస్తులు పూలవర్షంతో స్వాగతించారు. అనంతరం గ్రామంలోని ముక్కెర వంశీయులు రాజ శ్రీ రాంభూపాల్ నివాసానికి చేర్చారు. అక్కడ ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు జరిపారు. మహ బూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి స్వామివారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మపూరం గ్రామానికి చెందిన నంబి వంశస్తులు ఆభరణాలను తలపై పెట్టుకొని అంభోరు మధ్య కాలినడకన కురుమూర్తి కొండకు చేర్చారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. ఊరేగింపుగా తీసుకొచ్చిన ఆభరణాలను ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డిల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటయ్యకు అందజేయగా.. స్వామివారికి అలంకరించారు. దీంతో కాంచనగుహ స్వర్ణకాంతులతో పులకరించింది.
కాంచనగుహకు స్వర్ణకాంతులు
కాంచనగుహకు స్వర్ణకాంతులు


