పట్టువస్త్రాల తరలింపు..
కురుమూర్తిస్వామి అలంకారోత్సవంలో భాగంగా అమరచింత పద్మశాలీ కులస్తులు మగ్గంపై నేసిన పట్టువస్త్రాలను ఆలయానికి తరలించారు. వారం రోజులపాటు భక్తిశ్రద్ధలతో స్వామివారికి పట్టుపంచె, అమ్మవారికి పట్టుచీర తయా రు చేసిన పద్మశాలీలు.. స్థానిక భక్త మార్కండేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలను ఉరేగింపుగా ఆత్మకూర్ కు తరలించారు. అక్కడ మంత్రి వాకిటి శ్రీహరి పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా కురుమూర్తి క్షేత్రానికి బయలుదేరారు. కార్యక్రమంలో ఎస్పీ రావుల గిరిధర్ దంపతులు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సంఘం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, నారాయణపేట డీసీసీ అధ్యక్షు డు ప్రశాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీను, శ్రీధర్‌గౌడ్, వీరేశ లింగం పాల్గొన్నారు.


