బంగారం దుకాణంలో చోరీకి యత్నం
మరికల్: మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో ఓ బంగారం దుకాణంలో దొంగలు చోరీకి యత్నించారు. మరికల్ ప్రధాన చౌరస్తాలో ఉన్న గణేష్ జ్యువెలర్స్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు షాపు షెట్టర్‌ను కట్‌చేసి లోపలికి ప్రవేశించి లాకర్‌ను కూడా కటర్‌తో కట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యరు. ఆదివా రం ఉదయం గమనించిన చుట్టుపక్కల వ్యా పారులు విషయాన్ని దుకాణా యాజమానికి సమాచారం అందించారు. షాపు యాజమాని చోరీ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రాము దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం కూల్స్ టీంతో వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


