విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
కోడేరు: కరెంట్ షాక్‌తో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఖానాపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆది కర్రె బాలస్వామి (60) ఆదివారం వీధి లైట్ల ఏర్పాటులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ బంద్ చేశాడు. లైట్లు వేసిన అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆన్ చేసి చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలస్వామికి భార్య మశమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగదీష్ తెలిపారు.
భవనం పైనుంచి పడి బీహార్ వాసి మృతి
● మంకి లిఫ్ట్ ఆపరేటింగ్‌కు వెళ్లి
మృత్యువాత?
వనపర్తి: జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి బీహార్‌కు చెందిన మేసీ్త్ర తిలక్‌సా (45) మృతిచెందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. తోటి కార్మికులు, నిర్మాణ కంపెనీ ఇంజినీర్ సతీష్‌రావు కథనం మేరకు.. బిహార్‌కు చెందిన తిలక్‌సా తన బృందంతో వైద్య కళాశాల, రెసిడెన్సీ, డైనింగ్ తదితర ఐదు భవనాల నిర్మాణాలు చేపడుతూ సుమారు మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. పనులు తుదిదశకు చేరుకోవడంతో ఇటీవల వేగం పెంచారు. ఆదివారం ఉదయం వైద్య కళాశాల భవనం వెనకభాగంలో మూడో అంతస్థులో మంకీ లిఫ్ట్ వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అక్కడే ఉన్న ఓ వైద్యు డు పరీక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో ఇంజినీర్ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బిహార్‌కు తరలించామని ఇంజినీర్ వివరించారు.
● భవన నిర్మాణ సమయంలో కార్మికులు, మే సీ్త్రల రక్షణకు తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్య త అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్‌పై ఉంటుంది. సుమారు నాలుగైదేళ్లుగా భవన నిర్మాణ ప నులు కొనసాగుతున్నా..ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హెచ్‌ఎంపై
ఎస్బీ కానిస్టేబుల్ దాడి
గోపాల్‌పేట: రేవల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న మహిళా ప్రధానోపాద్యాయురాలిపై శనివారం ఎస్‌బీ కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. పాఠశాల హెచ్‌ఎం తెలిపిన వివరాల మేరకు.. ఎస్‌బీ కానిస్టేబుల్ శనివారం కొత్తగా జాబ్ వచ్చిన వ్యక్తికి సంబంధించిన బోనఫైడ్ సేకణరించేందుకు రేవల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వెళ్లాడు. అతడు ఐదోతరగతి వరకు ఈ ప్రాథమిక పాఠశాలలోనే చదివాడు. పరుష పదజాలంతో హెచ్‌ఎంను దూషిస్తూ అతడి బోనఫైడ్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాఠశాల హెచ్‌ఎం అందుకు నిరాకరించింది. దీంతో ఎస్‌బీ కానిస్టేబుల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఓ మహిళా కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను తీసుకుని తిరిగి పాఠశాలకు వచ్చాడు. ఆ తర్వాత వాదోపవాదాలు జరుగుతుండగా విచక్షణ కోల్పోయిన ఎస్‌బీ కానిస్టేబుల్ ప్రధానోపాద్యాయురాలిపై చేయిచేసుకున్నాడు. అనంతరం ఇరువురూ రేవల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తనకు అవమానం జరిగిందని ఈ విషయం సోమవారం ఉన్నతాఅధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు హెచ్‌ఎం తెలిపారు. ఇదే విషయం ఆదివారం రేవల్లి ఎస్‌ఐని వివరణ కోరగా.. విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపారు.
స్వగ్రామానికి
జవాన్ మృతదేహం
అమరచింత: రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో విధులు నిర్వర్తించే శంకర్‌నాయక్ కుటుంబ కలహాలతో శుక్రవారం అక్కడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగా కుటుంబ సభ్యులు అక్కడి నుంచి అంబులెన్స్‌లో స్వగ్రామమైన మండలంలోని దీప్లానాయక్‌తండాకు తీసుకొచ్చారు. ముందుగా అమరచింత వీధుల్లో యువకులు, తండావాసులు జాతీయ జెండాలు చేతబట్టి మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించి తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న వయస్సులో కుమారుడు దూరమవడం, తమ తండ్రి ఇక రాడని తెలియని చిన్నారుల రోధనలు పలువుర్ని కంటతడి పెట్టించాయి.
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి


